.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -128 లో... సంజయ్ గదిలోనే పడుకోమని జానూతో రమణి చెప్పడంతో జాను సంజయ్ గది దగ్గరకు వెళ్తుంది. సంజయ్.. నన్ను అండీ, ఏవండీ, శ్రీవారు అని పిలవకు, సర్ అని పిలువమని అంటాడు. నేను ఎక్కడ పడుకోవాలని జాను అడిగితే నీ ఇష్టం ఎక్కడైనా పడుకోమని అంటాడు. రమణిగారు మీ గదిలో పడుకోమన్నారని జాను అంటే.. నేను నా గది ఎవరితో పంచుకోను.. మనం పెళ్లి చేసుకున్నాం కదా.. గంపెడు పిల్లలు కనాలని చేసుకున్నామా? అగ్రిమెంట్ చదవలేదా.. అందులో నీకు నా గదిలోకి ఎంట్రీ లేదని క్లియర్ గా ఉందని సంజయ్ అంటాడు. అగ్రిమెంట్ చూపించండి అని జాను అడిగితే మెడలో వేసుకొని తిరగను కదా.. ఆఫీస్ లో ఉంది రేపు ఇస్తానని అంటాడు. సరే హాల్లో పడుకుంటా.. బామ్మ తాతయ్య వచ్చి అడిగితే అగ్రిమెంట్ లో రాసి ఉందని చెప్తానని జాను అనగా ఏంటి బెదిరిస్తున్నావా.. ఈ ఇంట్లో గెస్ట్ బెడ్ రూం ఉంది. అక్కడ పడుకో.. నన్ను ఇబ్బంది పెట్టకని సంజయ్ డోర్ వేసేస్తాడు.
మరోవైపు గాయాలతో ఉన్న సూర్యని అతని ఫ్రెండ్ ఇంటికి తీసుకొస్తాడు. ఎందుకురా ట్రీట్మెంట్ చేసుకోకుండా తెచ్చేయ్మన్నావ్ అంటే ఈ గాయాల కంటే జాను దూరంగా ఉందనే బాధ ఎక్కువ ఉందిరా.. జాను అంటే నాకు ఎంత ఇష్టమో నేను అంటే అంత కంటే ఎక్కువ ఇష్టంరా తనకి, జాను కోసం నేను బాధపడుతుంటే నిత్య పెళ్లాంలా నా పక్కనే ఉంటుందిరా.. అందుకే ఉండలేక వచ్చేశానని సూర్య అంటాడు. జాను ఒక్కసారి కలిస్తే జరిగిందంతా చెప్తా, నా ప్రేమ చెప్తా, మళ్లీ మేం కలుస్తామని సూర్య ఎమోషనల్ అయి ఏడుస్తాడు. ఇటు మురళీకి స్కూల్ పిల్లలకు యూనిఫాం కుట్టే కాంట్రాక్ట్ వస్తుంది. వారంలో కుట్టేస్తే 50 వేలు లాభం వస్తుందని నందుతో చెప్తాడు. అమెరికా వెళ్లాలని ఆశపడ్డా నా ఆశలు కరిగిపోయాయి. ఇక జాబ్ చేస్తా బావ, ఇల్లు గడవాలి, ఇంకా ఇద్దరు చెల్లెళ్లు చదవాలని నందు ఏడుస్తుంది. భార్య బయటకు వెళ్లి పని చేయకూడదా, భర్తలా అడ్డుకుంటావా అని నందు అనగా.. భర్తలా కాదు కనీసం నన్ను స్నేహితుడిగా చూడు నందు అని మురళి అంటాడు.
రాత్రి నిద్రలో ఉండగా శారదకి గుండె నొప్పి వస్తుంది. గౌతమి కంగారు పడి నందు, మురళీలను పిలుస్తుంది. అందరూ కంగారుగా శారదని పట్టుకుని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి వస్తారు. మురళీ క్యాబ్ బుక్ చేస్తాడు. ఇక జాను మేడ మీద నుంచి చూసి.. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు.మ అమ్మకి ఏమైందని పరుగున వస్తుంది. దగ్గరకు రావొద్దని శారద అరుస్తుంది. దగ్గరకు రావొద్దు, అంతా నీ వల్లే అని గౌతమి, బామ్మ, నందు జాను మీద అరుస్తారు. వెళ్లిపోవే, అమ్మ హాస్పిటల్ కి వెళ్లకముందే నిన్ను చూస్తే చనిపోతుందని నందు అంటుంది. క్యాబ్ రావడంతో అందరు శారదని తీసుకెళ్తారు. జానుని రావొద్దని వారిస్తారు. జాను ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది.
మరోవైపు జాను కోసం సూర్య వెతకడానికి బయటకు తీసుకెళ్లమని తన ఫ్రెండ్ తో చెప్తాడు. ఇటు శివుడి ఇంట్లో రమణి బయట డోర్ తీసి ఉండటం చూసి.. ఎవరు తీశారని అనుకుంటుంది. తన భర్తకి చెప్తే అతను.. సీసీకెమెరాలో చూస్తానని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

